విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి
ఆలేరురూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ విజ్ఞానాన్ని వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వృత్తిపర నైపుణ్యాలను పెంపొందించడంలో కాంప్లెక్స్ సమావేశాలు దోహదం చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ చదవడం, రాయడం, గణిత సామర్థ్యాలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మి, ఉపాధ్యాయులు మంజులు, వెంకటయ్య, కోట శ్రీనివాస్‌రావు, శోభ, రవి, కిరణ్, దశమంతరెడ్డి, సయ్యద్, సుచిరత, శ్రీదేవి, సరిత తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యనందించాలి
రాజాపేట: విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని రఘునాథపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఆయన వెంట అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి చందా రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోజ్‌కుమార్ తదితరులున్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment