కొనసాగుతున్న సీఎం కప్ క్రీడాపోటీలు
భువనగిరి: పట్టణంలో ఈ నెల 16న ప్రారంభమైన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు రెండో రోజు మంగళవారం కొనసాగాయి. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బాలకృష్ణ, ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment