ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు మినహా ఏ హామీని అమలు చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ఆరోపించారు. సీపీఎం జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం మూడోరోజు ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, ప్రజల్లో సుస్థిర స్థానం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. వారు మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఎన్నో హామీలు గుప్పించి వాటిని అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. తక్షణమే హామీలను పూర్తిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని శ్రేణులకు సూచించారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేది కేవలం వామపక్షాలు మాత్రమేనని తెలిపారు. మహాసభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, పైల్ల ఆశయ్య, బొంతల చంద్రారెడ్డి, మంగ నర్సింహులు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేషం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, ఎండీ పాష, గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్, బండారు నర్సింహ, పల్లె మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment