ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
రామన్నపేట: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో ఇన్‌పేషంట్లు తక్కువమంది ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇన్‌పేషెంట్లకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యతగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఓపీ విభాగంలో అందిస్తున్న వైద్యసేవలు, అనంతరం సూపరింటెండెంట్ గదిలో రికార్డులు పరిశీలించారు. ఒకేరోజు 60శాతం మందికి సెలవు మంజూరు చేయడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి ఎక్కువ మందికి సెలవు ఎలా మంజూరు చేశారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. డాక్టర్ ఆదిలక్ష్మి ఏడాది కాలంగా విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించి విధుల నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు పెట్టాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. స్థానికులు మంచినీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే భగీరథ కనెక్షన్ ఇవ్వాలని ఎస్‌ఈకి సూచించారు. అనుభవం కలిగిన రెగ్యులర్ గైనకాలజిస్ట్‌ను తక్షణమే నియమించాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. ఆయనవెంట సూపరింటెండెంట్ ఈశ్వర్, డాక్టర్ వరుణ్‌రెడ్డి ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment