‘పెద్దగట్టు’కు ప్రణాళికలు సిద్ధం చేయండి
చివ్వెంల: పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోని శ్రీలింగమంతుల స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. జాతరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి అధి కారులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు పెద్దగట్టు జాతర జరగనుందన్నారు. జాతరను ప్రశాంతమైన వాతా వరణంలో నిర్వహించాలని, ఏర్పాట్లలో భాగంగా ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. అన్నిశాఖల అధికా రులు సమన్వయంతో పనిచేస్తూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎ.సులోచన, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సూర్యాపేట డీఎస్పీ రవి, ఈఓ కుశలయ్య, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ సంతోష్‌కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు ఇంట్రా శ్రీనివాస్, గ్రిడ్ అధికారి కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ సూర్యాపేట కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment