ఫూటుగా తాగి.. పోలీసులకు చిక్కి
భువనగిరిటౌన్ : న్యూ ఇయర్ సందర్భంగా జిల్లాలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఫూటుగా తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వేకువజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగాయి. 135 కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
విస్తృతంగా తనిఖీలు
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మంగళవారం రాత్రి పోలీసులు పటిష్ట బందబోస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి, ఇతర ప్రధాన రోడ్లు, కూడళ్లలో పెట్రోలింగ్ చేశారు. ఘర్షణలకు తావులేకుండా గస్తీ నిర్వహించారు. ముఖ్యంగా రోడ్డు ప్ర మాదాలు జరగకుండా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.ఎకై ్పజ్, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా మొత్తం 135 కేసులు నమోదయ్యాయి.
మద్యం దుకాణాలు కిటకిట
మద్యం షాపులు మందుబాబులతో కిటకిట లాడా యి. లైసెన్సుడు షాపుల్లో రాత్రి 12 వరకు, బార్లకు ఒంటి గంట వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వైన్స్‌ల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.
ఫ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
ఫ 135 మందిపై కేసులు నమోదు
Comments
Please login to add a commentAdd a comment