రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
బీబీనగర్ : రోడ్డు భద్రతా వారోత్సవాలను శుక్రవారం బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద నేషనల్ హైవే అథారిటీ అధికారులు ప్రారంభించారు. వారోత్సవాల కరపత్రాలను విడుదల చేయడంతో పాటు వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచిచంఆరు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే ఆర్‌ఈ కోటిలింగం, టోల్‌ప్లాజా పీహెచ్ తేజోనిధి, హెచ్‌ఓయూ శ్రీనివాస్, మేనేజర్ సుధీర్, రూట్ మేనేజర్ రాకేష్, అనిల్, వివేక్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన
భువనగిరి : జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం భువనగిరి మండలం వడపర్తిలోని శ్రీనివాస రామానుజన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు డీటీఓ సాయికృష్ణ రోడ్డు భద్రతా నియామాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించాలని, అతివేగంతో వాహనాలు నడపవద్దన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment