కుటుంబంలోని పిల్లల్లా భావించాలి
భూదాన్‌పోచంపల్లి : పాఠశాలను సొంత ఇల్లులా.. విద్యార్థులను తమ కుటుంబంలోని పిల్లల్లా భావించి వారి ఉన్నతికి పాటుపడాలని ఉపాధ్యాయులకు డీఈఓ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కోరారు. సంక్రాంతి తరువాత సిలబస్ రివిజన్ చేయాలని పేర్కొన్నారు. విదేశాల్లో స్థిరపడిన, ఫౌజ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు చేస్తున్న మొత్తం 16మంది ఉపాధ్యాయులను గుర్తించి కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని ఇటీవల సర్వీస్ నుంచి తొలగించినట్లు తెలిపారు. నూతన మెనూకు అనుగుణంగా బిల్లులు చెల్లించనున్నట్లు తెలిపారు. గుడ్డు ధరను పేపర్ రేట్ ప్రకారం చెల్లించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట ఎంఈఓ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయుడు రాజా రెడ్డి, ఉపాధ్యాయులు నర్సింహారావు, బ్రహ్మచారి, అచ్చయ్య తదితరులు ఉన్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment