అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమం ఉధృతం
సాక్షి యాదాద్రి : రీజినల్ రింగ్ రోడ్డును మొదటి అలైన్‌మెంట్ ప్రకారంగానే నిర్మించాలని, లేనిపక్షంలో తీవ్ర ఉద్యమం తప్పదని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బీబీనగర్ మండలంలోని గూడూరులో భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధి అవుతలనుంచి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాంచాలని, అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య 40 కిలో మీటర్ల దూరం ఉండాలన్నారు. కానీ, చౌటుప్పల్ ప్రాంతంలో 20–28 కిలో మీటర్లు మాత్రమే ఉందన్నారు. అలైన్‌మెంట్ మార్చడం వల్ల జీవనాధారమైన వ్యవసాయ భూములు పోతున్నాయన్నారు. కొందరికోసం పేద రైతులు, ప్రజల ఆస్తులు గుంజుకోవాలని చూస్తే ఊరుకోబోమని, ఎంత వరకై నా వెళ్తామన్నారు. మొదటి అలైన్‌మెంట్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని, రాయగిరి, చౌటుప్పల్, భువనగిరి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఫ బీజేపీ నాయకుడుగూడూరు నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment