అన్ని వర్గాల ప్రజలకు పథకాలు
భూదాన్‌పోచంపల్లి : కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల మహిళా సమాఖ్యకు గ్రామీణ జీవనోపాధుల మిషన్‌కింద మంజూరైన ట్రాక్టర్, కల్టివేటర్, బేలర్‌ను డీఆర్‌డీఓ నాగిరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిర ఇళ్లు మంజూరు చేస్తామని, త్వరలో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వాలంభన సాధించాలని కోరారు. అనంతరం 45 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ, ఉన్నతి పథకం కింద పాడి పరిశ్రమ, పాడి ఉత్పత్తుల్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అదే విధంగా 12వ వార్డులో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రం, నారాయణగిరిలో దివీస్ లేబోరేటరీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రమాదకరంగా మారిన వ్యవసాయ బావిని పరిశీలించారు. 12, 13 వార్డుల్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరనాయక్, ఎంపీడీఓ భాస్కర్, ఎస్‌ఈటీఐ డైరెక్టర్ రఘుపతి, గ్రామీణాభివృద్ధి సహాయ అధికారి శ్రీనివాస్, ఏపీఎం నీరజ, ఏపీఓ కృష్ణమూర్తి, కౌన్సిలర్లు దేవరాయకుమార్, భోగ భానుమతి, తడక వెంకటేశం, మండల, పట్టణ అధ్యక్షులు పాక మల్లేశ్, భారత లవకుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, జిల్లా నాయకులు సామ మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment