నిధులు లేక.. పనులు పూర్తికాక!
భువనగిరి : కూరగాయలు, పండ్లు, మాంసం ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉండేలా భువనగిరిలో చేపడుతున్న సమీకృత మార్కెట్ పనులు తుది దశలో నిలిచిపోయాయి. సీసీ, విద్యుత్ పనులు పూర్తిచేస్తే మార్కెట్ అందుబాటులోకి రానుంది. కానీ, ఏడాది కాలంగా పైసా విడుదల కాకపోవడంతో ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలు అలంకారప్రాయంగా మారాయి.
మూడేళ్ల క్రితమే పనులకు శంకుస్థాపన
ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.9.72 కోట్లు కేటాయించింది. నిర్మాణ పనులకు 2021 అక్టోబర్ 2న అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మార్కెట్‌లో 192 స్టాల్స్ నిర్మించారు. ఇందులో నాన్‌వెజ్ 48, వెజ్ 102, పండ్లు, పూల విక్రయాలకు 20, ఇతర దుకాణాల కోసం 13 స్టాల్స్ నిర్మించారు. వీటికి రంగులు వేయడం, సెట్టర్లు బిగించడం పూర్తయ్యింది. సిమెంట్ కాంక్రీట్ (సీసీ), విద్యుత్ పనులు మాత్రమే మిగిలిపోయాయి. ఇంతలో ఎన్నికల రావడంతో పనులు ఆగిపోయాయి.
తుది దశలో నిలిచిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్
ఫ సీసీ, విద్యుత్ పనులు పెండింగ్
ఫ అందుబాటులోకి వస్తే వ్యాపారులకు తీరనున్న సమస్యలు
ఈనెలలో ప్రారంభిస్తాం
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో సీసీ, విద్యుత్, పైపు నిర్మాణ పనులు పెండింగ్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసి ఈనెలలోనే మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకోసం మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి రూ.90 లక్షలు కేటాయించడం జరిగింది. త్వరలో టెండర్లు పిలుస్తాం. –రామాంజులరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, భువనగిరి
రోడ్లపైనే వ్యాపారాలు
పట్టణం శరవేగంగా విస్తరిస్తుండగా.. జనాభా కూడా అంతకంతకూ పెరుగుతోంది. పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రైతుబజార్ సరిపోవడం లేదు. దీనికి తోడు విక్రయదారులకు సరైన స్థలం లేక పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మాంసం, కూరగాయలు విక్రయిస్తున్నారు. సమీకృత మార్కెట్ పూర్తిచేస్తే నాన్‌వెజ్, వెజ్‌తో పాటు పండ్లు, కూరగాయలు, కిరాణ సామానుతో పాటు ఇతర అన్ని రకాల వస్తువులు ఒకేచోట విక్రయించుకునే సౌకర్యం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేసి మార్కెట్‌ను అందుబాటులోకి తేవాలని వ్యాపారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment