నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దు
యాదగిరిగుట్ట : అతివేగం, నిర్లక్ష్యంతో బస్సులు నడపవద్దని జిల్లా రవాణా అధికారి (డీటీఓ) సాయికృష్ణ, ఎంవీఐ ఇమ్రాన్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో బుధవారం డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఇటీవల జరిగిన ప్రమాదంలో డ్రైవర్ నరసింహ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. అంతేకాకుండా ప్రయాణికులను తమ కుటుంబ సభ్యుల్లా భావించాలని పేర్కొన్నారు. అనంతరం డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భద్రతా మాసోత్సవాల పోస్టర్లు, బ్యానర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఇంజనీర్ హనుమానాయక్, అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్, డిపో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీటీఓ సాయికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment