‘పది’కి ప్రత్యేక తరగతులు
భువనగిరి : పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ దృష్టి సారించింది. అందుకోసం గురువారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్టోబర్ 17నుంచి సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తి చేయడంతో ఇక ఉడయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. రోజూ రోజు రెండు సబ్జెక్టుల చొప్పున పాఠం వారీగా చదివించేందుకు ప్రణాళిక రూపొందించి పాఠశాలలకు అందజేశారు. నేటినుంచి మార్చి 20వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు కొనసాగనున్నాయి.
8,631 మంది విద్యార్థులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 8,631 మంది ఉన్నారు. వీరంతా మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ప్రభుత్వ విద్యార్థులు 4,931 మంది ఉన్నారు.
అల్పాహారం లేకుండా
ప్రత్యేక తరగతులు ఎలా..
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం మంచి ఉద్దేశమే. కానీ, దూరప్రాంత విద్యార్థులు ఉదయం 7 గంటలకే ఇంటినుంచి బయలుదేరాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోకుండా రావడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో అల్పహారం అందజేసేవారు. ఈ సారి ఇప్పటివరకు ఆ విషయంపై ప్రస్తావనే లేదు.
ఫ నేటి నుంచి ప్రారంభం
ఫ వంద శాతం ఫలితాలపై విద్యాశాఖ దృష్టి
Comments
Please login to add a commentAdd a comment