బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ ఎస్పీ
భువనగిరిటౌన్ : అసిస్టెంట్ ఎస్పీగా నియమితులైన కంకణాల రాహుల్‌రెడ్డి (ఐపీఎస్) బుధవారం భాద్యతలు స్వీకరించారు. 2021 బ్యాచ్‌కు చెందిన రాహుల్ రెడ్డి తెలంగాణ గ్రేహౌండ్స్‌లో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనను అసిస్టెంట్ ఎస్పీగా నియామకం చేస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్‌రెడ్డి అసిస్టెంట్ ఎస్పీ హోదాలో భువనగిరి సబ్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన.. భువనగిరి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో సమావేశం అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి సూచనలు చేశారు. రాహుల్‌రెడ్డిని పలువురు పోలీసు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు అసిస్టెంట్ ఎస్పీకి బదిలీపై వెళ్తున్న భువనగిరి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment