విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
సూర్యాపేట టౌన్: విద్యార్థులను ఉన్నతులుగా.. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని మాజీ మంత్రి గుంటకండ జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను సోమవారం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, దీనిపై శాసనసభలో ప్రశ్నిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, జిల్లా నాయకులు గుణగంటి కృష్ణ, వరిపల్లి అంజయ్య, నెల్లుట్ల పాపయ్య, ఎస్.రమేష్, శ్రీనివాస్, ఉపేందర్, కేశయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment