మోదుబావిగూడెం వాసికి నేషనల్ ప్రీమియం అవార్డు
ఆత్మకూరు(ఎం): మండలంలోని మొదుబావిగూడేనికి చెందిన ప్రశాంత్ చంద్రగిరి నేషనల్ ప్రీమియం– 2025 బెస్ట్ సాంగ్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సరస్వత పరిషత్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు జడ్జి చంద్రకుమార్, జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు, నేషనల్ ప్రిమీయం అవార్డు ఫౌండర్ పరిపెల్లి రవీశ్రీ గౌరిశ్రీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, సమాజానికి ఉపయోగపడే మరిన్ని గీతాలు రాసి పాడుతానని ప్రశాంత్ చంద్రగిరి ఈ సందర్భంగా తెలిపారు. చంద్రగిరిని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment