వైఎస్సార్‌సీపీలో చేరిన కుటుంబాలతో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుంచి వలసలు ఆరంభమయ్యాయని ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమనారెడ్డి బావమరిది, ప్రొద్దుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి వేంపల్లె సురేంద్రనాథ్ రెడ్డి (సూరి)తోపాటు 300 కుటుంబాలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సమక్షంలో ఆదివారం టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పరిపాలన చూసి ఇతర పార్టీల నేతలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తొలిగా టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు సూరి అని అన్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తోందన్నారు. మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని అడుగుతున్న ఏకై క నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. ఆయన పరిపాలనను మెచ్చుకుని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక టీడీపీ నేతలు లక్షల రూపాయలు పెట్టి తమ పార్టీ కౌన్సిలర్లు, ఇతర నేతలను కొనుగోలు చేసేందుకు మభ్యపెడుతున్నారన్నారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, టీడీపీకి మధ్య ఉన్న వ్యత్యాసమన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కొవ్వూరు రమేష్‌రెడ్డి సారథ్యంలో సూరిని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. కొవ్వూరు రమేష్ రెడ్డి సూచనతోనే శివాలయం కమిటీ చైర్మన్‌గా కొత్తమిద్దె రఘురామిరెడ్డిని నియమించామన్నారు. రానున్న ఎన్నికల్లో తనను 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. సూరి నాయకత్వంతో కొత్తపల్లె పంచాయతీలో పార్టీ బలం ఒకటికి రెండు రెట్లు పెరిగిందన్నారు. వేంపల్లె సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పరిపాలనను మెచ్చి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని విశ్వసించి పార్టీలో చేరుతున్నానన్నారు. కార్యక్రమంలోఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, కొవ్వూరు రమేష్ రెడ్డి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, వరికూటి ఓబుళరెడ్డి, శివాలయం కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వందలాది మందితో ర్యాలీ
లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి వేంపల్లె సురేంద్రనాథరెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అమృతానగర్, ప్రకాష్‌నగర్, వివేకానంద నగర్ ప్రాంతాలనుంచి వందలాది మంది కార్యకర్తలు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి సభా స్థలికి చేరుకున్నారు
50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
కడప కార్పొరేషన్ : కడప నగరంలోని 50వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి 50 కుటుంబాలకు చెందిన మహిళలు వైఎస్సార్‌సీపీలో చేరారు. శనివారం రాత్రి స్థానిక సాయిపేటలోని మఠం బడి వద్ద వైఎస్సార్‌సీపీ 50వ డివిజన్ ఇన్‌చార్జి కట్టమీద రాజశేఖర్‌రెడ్డి, మహిళా నాయకురాలు షేక్ మౌలానీ ఆధ్వర్యంలో వారు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా పేరు పేరునా పలకరించి, కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు, రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. 2019 ఎన్నికల ముందు పసుపు, కుంకుమ పేరుతో రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. డ్వాక్రా మహిళలందరూ దీన్ని ఇంకా గుర్తుంచుకున్నారని, తొలిసారిగా మహిళలు వైఎస్సార్‌సీపీలో చేరడం జగనన్న సుపరిపాలనకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తు.చ తప్పకుండా అమలు చేశారని, అన్ని వర్గాల వారికి మేలు చేసేలా పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారిలో షేక్ ముంతాజ్, కరిమూన్, సుభానీ, ముంతాజ్, శాంత, రాములమ్మ, లక్ష్మిదేవి, నాగసుబ్బమ్మ, నాగలక్ష్మి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్, హరూన్ గ్రూప్స్ ఎండీ అహమ్మద్‌బాషా, ఉమైర్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో 15 కుటుంబాలు చేరిక
బద్వేలు అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని 27, 28 వార్డుల్లో గల చెన్నంపల్లె గ్రామంలో టీడీపీకి చెందిన టి.వెంకటసుబ్బయ్య, కె.వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో 15 కుటుంబాల వారు ఆదివారం మున్సిపల్ చైర్మన్ వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక నెల్లూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన కుటుంబాలకు మున్సిపల్ చైర్మన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని అన్నారు. కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషితో ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూశారని, జగనన్న మాత్రం సామాజిక సాధికారత పేరుతో ఆయా వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా మేలు చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి చెన్నకృష్ణారెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, గుర్రాల పెంచలయ్య, రంగారెడ్డి, ఓబులేసు, బ్రహ్మయ్య, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
జగనన్న పరిపాలన చూసే ఈ మార్పు
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వెల్లడి
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన
మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్ బావమరిది సూరి
Comments
Please login to add a commentAdd a comment