తిరుపతి–షోలాపూర్ రైలు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–షోలాపూర్–తిరుపతిల మధ్య వారాంతపు రైలును మరో మూడు నెలలపాటు పొడిగించారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 01437 నెంబరుగల రైలు ప్రతి గురువారం రాత్రి 9.40 గంటలకు షోలాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 7.45 గంటలకు తిరుపతికి చేరుతుందన్నారు. అలాగే 01438 నెంబరుగల రైలు తిరుపతిలో ప్రతి శుక్రవారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 11.50 గంటలకు షోలాపూర్ చేరుతుందన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మార్చి 28వ తేది వరకు అధికారులు పొడిగించార న్నారు. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్‌రోడ్డు, యాదగిరి, వాడి, గుల్బర్గా, బీదర్, లాతూర్ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment