వర్చువల్‌గా వైవీయూ పాలకమండలి సమావేశం | - | Sakshi
Sakshi News home page

వర్చువల్‌గా వైవీయూ పాలకమండలి సమావేశం

Published Wed, Jan 1 2025 2:10 AM | Last Updated on Wed, Jan 1 2025 2:10 AM

-

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాల యం పాలకమండలి సమావేశం మంగళవారం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు, ఉన్నతవిద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ తదితరులు వర్చువల్‌ విధానంలో హాజరుకాగా, వైవీయూలో పాలకమండలి సభ్యులు ఆచార్య పి. చంద్రమతీశంకర్‌, మూల మల్లికార్జునరెడ్డి, జె. వెంకటలక్ష్మి, కె. చిన్నసుబ్బారావు, పి. ముబీనాబేగం పాల్గొన్నారు. విశ్వవిద్యాలయానికి రెగ్యులర్‌ వైస్‌ చాన్సలర్‌ నియామకం కోసం సెర్చ్‌ కమిటీలో వర్సిటీ నామినీ కోసం ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిర్వహించారు. వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు పాలకమండలి సమావేశానికి దూరంగా ఉండాలని పేర్కొనడంతో వైవీయూ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్‌, వైవీయూ, ప్రొద్దుటూరు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ సమావేశానికి హాజరుకాలేదు. కాగా ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులను నామినీగా నియమించినట్లు తెలిసింది.

వీసీని కలిసిన పాలకమండలి సభ్యులు

యోగివేమన విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు విద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కె. కృష్ణారెడ్డిని కలిశారు. ఉపకులపతిగా నియమితులయ్యాక తొలిసారిగా వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధిపై చర్చించారు.

వీసీ నామినీ ఏర్పాటుపై తీర్మానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement