ఎస్‌జీఎఫ్ నేషనల్స్‌కు ఇర్ఫాన్
కడప స్పోర్ట్స్/ ప్రొద్దుటూరు కల్చరల్:
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి అండర్–14 క్రికెట్ పోటీలకు జిల్లాకు చెందిన సికిలిగిరి సాద్ ఇర్ఫాన్ ఎంపికయ్యాడు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈ యువ క్రికెటర్ నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో వైఎస్‌ఆర్ కడప జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి చక్కటి ప్రతిభ కనబరచడంతో పాటు ప్రాబబుల్స్ మ్యాచ్‌ల్లో రాణించాడు. దీంతో జాతీయస్థాయి ఏపీ అండర్–14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఓపెనింగ్ స్థానంలో ఆడే ఇర్ఫాన్ తన బ్యాటింగ్ టెక్నిక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇతని ఎంపికపై క్రికెట్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment