కడప సెవెన్‌రోడ్స్: భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జిల్లాలో 31 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బద్వేలు రెవెన్యూ డివిజన్‌లోని అట్లూరు మండలం కుంభగిరి, బి. కోడూరు మండలం తిప్పరాజుపల్లి, బి.మఠం మండలం టి.సౌదరివారిపల్లె, కలసపాడు మండలం దూలమవారిపల్లి, కాశినాయన మండలం వంకమర్రి, పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లి, మార్కాపురంలో సదస్సులు జరగనున్నాయి. పులివెందుల రెవిన్యూ డివిజన్‌లోని చక్రాయపేట మండలం కె.రాజుపల్లి, తొండూరు మండలం సైదాపురం, లింగాల మండలం రామనూతలపల్లె, సింహాద్రిపురం మండలం జంగమరెడ్డిపల్లె, పులివెందుల మండలం రాచుమర్రిపల్లిలో... జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని గాదెగూడూరు, మోడమీదిపల్లె, జి.ఉప్పలపాడు గొల్లపల్లె, బోడితిపనిపాడు, బి.వెంకటాపురం, కె.బ్రాహ్మణ పల్లి, కె.సుగుమంచిపల్లె, ఎర్రగుంట్ల, ఎస్.ఉప్పలపాడు, కె.తిమ్మాపురం,టి.సల్లబస్యపల్లె, పెద్దగురువలూరులో సదస్సులు జరగనున్నాయి. ఇక కడప రెవెన్యూ డివిజన్‌లోని కొన్నాయపల్లె, అంకాయపల్లి, బుడ్డాయపల్లి, పాపాసాహెబ్ పేట, కమలాపురం మండలం పందిళ్లపల్లి, చెన్నూరు మండలం ముండ్లపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయని డీఆర్వో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment