సంబేపల్లె: ప్రతి నెల ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ రెండు గ్రామాలలోని లబ్ధిదారులకు అందక పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని రౌతుకుంట, సంబేపల్లె గ్రామాలకు సంబంధించి దాదాపు 500 మంది పింఛన్ దారులు కొత్త సంవత్సరం మొదట్లోనే పింఛన్ అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. బుధవారం ఉదయాన్నే పింఛన్ వస్తుందని ఎదురు చూసి, ఆయా గ్రామాల సచివాలయాల వద్దకు వెళ్లారు. సాంకేతిక కారణాల వలన పింఛన్ నగదు బ్యాంకు నుంచి రాలేదని సంబంధిత అధికారులు చెప్పడంతో దిగాలు చెందారు. ఉన్నత స్థాయి అధికారులు చొరవ తీసుకొని తమకు పింఛన్ అందేలా చూడాలాని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment