అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైళ్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రతి ఏడాది శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో పెరుగుతూ వస్తోంది. వీరిలో అధిక మంది రైలు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్లు లభించని వారు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వేశాఖ అధికారులు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెలలో కడప మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రస్తుతం శబరిమలకు వెళ్లేందుకు కడప మీదుగా ప్రతిరోజు పూణె–కన్యాకుమారి–పూణె మధ్య కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. ఈ రైలు పూణెలో ప్రతిరోజు రాత్రి 11.50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు కడపకు చేరుకుని మరుసటిరోజు తెల్లవారుజాము 5.10 గంటలకు కొట్టాయంకు చేరుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో కన్యాకుమారిలో ప్రతిరోజు ఉదయం 8.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.25 గంటలకు కడపకు చేరుతుంది.
ప్రత్యేక రైళ్లు
అయ్యప్పభక్తులతోపాటు ఇతర ప్రయాణికుల కోసం 07151 నెంబరుగల కాచిగూడ నుంచి రైలు కొట్టాయంకు జనవరి 2, 9, 16, 23 తేదీల్లో ప్రయాణిస్తుంది.
● 07152నెంబరుగల రైలు కొట్టాయం నుంచి కాచిగూడకు జనవరి 3, 10, 17, 24 తేదీల్లో బయలుదేరుతుంది.
● 07065 నెంబరుగల రైలు హైదరాబాదు నుంచి కొట్టాయంకు జనవరి 7, 14, 21, 28 తేదీల్లో నడుస్తుంది.
● 07066 నెంబరుగల రైలు కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు జనవరి 8, 15, 22, 29 తేదీల్లో , 07183 నెంబరుగల రైలు నర్సాపురం నుంచి కొల్లాంకు జనవరి 15, 22 తేదీలలో బయలుదేరుతుంది.
● 07184 నెంబరుగల రైలు కొల్లాం నుంచి నర్సాపురానికి జనవరి 17, 24 తేదీలలో ప్రయాణిస్తుంది.
టిక్కెట్ల వివరాలు
కడప నుంచి కొట్టాయంకు జనరల్ టిక్కెట్ రూ. 265, స్లీపర్ రూ. 565, త్రీ టైర్‌ఏసీలో రూ. 1595, టు టైర్ ఏసీలో 2010గా నిర్ణయించారు. అలాగే కడప నుంచి కొల్లాంకు జనరల్‌రూ. 285, స్లీపర్ రూ. 595, త్రీ టైర్ ఏసీలో రూ.1680, టు టైర్ ఏసీలో రూ. 2240గా నిర్ణయించారు.
జనవరిలో రానూపోనూ 6 ప్రత్యేక రైళ్లు
కడప మీదుగా రాకపోకలు
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా రైల్వేశాఖ ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. భక్తులు తమ టిక్కెట్లను ముందు బుక్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. – జనార్దన్,
సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్, కడప
Comments
Please login to add a commentAdd a comment