కడప సెవెన్‌రోడ్స్: వ్యవసాయంలో నవ శకానికి నాంది పలకాలంటే రైతు ఆలోచనా విధానంలో మార్పు రావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైనాన్స్ స్కేల్ ఫిక్సేషన్, ప్రతిపాదనలపై డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నీకల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం డీసీసీబీ వారు ప్రచురించిన 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎల్‌డీఎం జనార్దన్, నాబార్డ్ ఏజీఎం విజయ్ విహారి తదితరులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు: జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్రీధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment