మైదుకూరు : ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
మైదుకూరు : మండల పరిధి అన్నలూరు పంచాయతీలోని చౌటపల్లె గ్రామంలో టీడీపీ నుంచి 50 కుటుంబాల వారు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, అయన తనయుడు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డిలకు టీడీపీ కార్యకర్తలు బాణసంచాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో టీడీపీ నాయకుడు అచ్చుకట్ల కరీముల్లా ఆధ్వర్యంలో అల్లా బకాష్ గారి అమీర్ బాషా, షేక్ షరీఫ్, దావూద్ సాహెబ్ గారి జాఫర్, చింతకుంట పెద్ద హుస్సేన్ పీరా, నడిపి హుస్సేన్ పీరా, బద్వేలు మాబుసాహెబ్, అల్లా బకాష్ గారి ఖాసీంవలి, ఫకృద్దీన్, షేక్ సిద్ధిక్, పర్వేజ్, దావూద్ సాహెబ్ గారి రియాజ్, అఫ్రిద్, చింతకుంట మౌలాలి, ఆలం తదితర 50 కుటుంబాల వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నాగిరెడ్డి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ డి.గంగాదర్ రెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ మదీనా దస్తగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమన్నారాయణరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ గల్లా నరసింహారెడ్డి, అన్నలూరు సర్పంచ్ ఎం.శ్రీనివాసులురెడ్డి, మైనారిటీ నాయకులు ముజఫర్, ట్రాక్టర్ గౌస్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ సానుభూతిపరులు
పులివెందుల టౌన్ : స్థానిక ఎర్రగుడిపల్లెలోని టీడీపీ సానుభూతిపరులు సోమవారం మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, సివిల్ సప్లయ్ రాష్ట్ర డైరెక్టర్ హాలు గంగాధరరెడ్డిల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. నారిగాళ్ల నరసింహులు, కుళ్లాయప్ప, పెద్ద నరసింహులు సంబంధించిన కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పురుషోత్తం, వైఎస్సార్‌సీపీ నాయకులు డేనియల్ బాబు, సూరి, నరసింహులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment