●ప్రతినెలా విద్యుత్ ఘాతం
ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పీపీసీఏ) కింద ఇప్పటికే జిల్లా ప్రజలపై కూటమి ప్రభుత్వం కోట్లలో భారం మోపింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతినెలా వడ్డనకు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్దుబాటు చార్జీలకు తోడుగా అక్టోబర్ నెల నుంచి ఏ నెలకు ఆనెల సర్దుబాటు పేరుతో యూనిట్‌కు 91 పైసలు చొప్పున భారం వేస్తున్నారు. ఇలా ప్రతినెలా సుమారు రూ.15 కోట్లను వసూలు చేయనున్నట్లు విద్యుత్ అధికారుల గణాంకాలు వివరిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల మరోవైపు విద్యుత్ చార్జీలు పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment