అశ్వవాహనంపై అనంతమూర్తి
కడప కల్చరల్ : దుష్ట సంహారం చేసేందుకు ఆయన ఖడ్గం చేతబూనాడు. ఉరకలేస్తున్న సమరోత్సాహంతో ఉత్తమ అశ్వంపై వేటకు బయలుదేరాడు. ఆ వీర గంభీర రూపం శత్రువులకు చూడగానే దడపుట్టించేలా ఉంది. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామిని సర్వభూపాల వాహనంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, టీటీడీ సూపరింటెండెంట్ హనుమంతయ్య ఆధ్వర్యంలో అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఉల్లాసభరితంగా ఊయల సేవను నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు రాత్రి కను ల పండువగా అలంకరించిన అశ్వవాహనంపై స్వా మిని మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా తిలకించిపులకించిపోయారు.
నేడు చక్రస్నానం: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయం ఎదుట గల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం ఊంజల్ సేవ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment