బిల్లు రూ. 500 పెరిగింది
కరెంటు ఛార్జీలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. నా వరకే కరెంటు బిల్లు రూ. 400–500 పెరిగింది. కరెంటు బిల్లులు ఇంతలా పెరుగుతాయని ఊహించలేదు. ప్రభుత్వం వెంటనే కరెంటు బిల్లులను తగ్గించాలి. – గంగాధర్‌రెడ్డి,
ఐటీఐ సర్కిల్, కడప
మాలాంటి పేదోళ్లకు ఇబ్బంది
కూలీ నాలీ చేసుకుని జీవించే మాలాంటి పేదోళ్లకు ఎక్కువగా వస్తున్న కరెంటు బిల్లులు కట్టాలంటే ఇబ్బందిగా ఉంది. అసలే పనులు లేక కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు డబ్బులు సమకూర్చేందుకు కష్టంగా ఉన్న సమయంలో ఇలా కరెంటు బిల్లులకు వందలాది రూపాయలు చెల్లించాలంటే కష్టంగా ఉంది. –పి.జయమ్మ, బద్వేలు
పెనుభారమే
విద్యుత్ చార్జీలు పెంచి మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం పెనుభారం మోపుతోంది. ఎన్నికల సమయంలోనేమో కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం. గతంలో ఐదారువందలు వచ్చే బిల్లు ఇప్పుడు రూ.900 నుంచి రూ.1000 వరకు వస్తోంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మాపై ఇలా అదనపు భారం మోపడం అన్యాయం.
– జి.రామరాజు, బద్వేలు
Comments
Please login to add a commentAdd a comment