కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గీత కులాల మద్యం దుకాణాలకు ఈ నెల 8 లోపల దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్స జ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 14 గీత కులాలకు మద్యం దుకాణాలను కేటాయించిందన్నారు. అందులో కడప–ఈడిగ, ప్రొద్దుటూరు –ఈడిగ, మైదుకూరు– ఈడిగ, పులివెందుల –గౌడ్, బద్వేలు–ఈడిగ, వీఎన్‌పల్లె –గౌన్‌డ్ల, ప్రొద్దుటూరు రూరల్–ఈడిగ,పెద్దముడియం–గౌడ్, సీకేదిన్నె –గౌడ, చక్రాయపేట– ఈడిగ, కాశినాయన–ఈడిగ, వేముల–గౌడ్, వల్లూరు, ఈడిగ, ఖాజీపేట –గౌడ్ కులాలకు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో దరఖాస్తు రుసుం రూ. 2లక్షలుగా నిర్ణయించబడిందన్నారు. లైసెన్స్ ఫీజు 50 శాతంగా నిర్ణయించబడిందన్నారు. జిల్లాలో 14 దుకాణాలకు గాను 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 8 తేదీ సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10న కలెక్టరేట్ సభాభవన్‌లో కలెక్టర్ సమక్షంలో డ్రా తీస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment