జిల్లా ఆస్పత్రిలో అమీర్ హంజాను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వెంగళరెడ్డిపేటకు చెందిన టైర్ల వ్యాపారి కోగటం అమీర్ హంజాపై దాడి చేసిన ఘటనలో టూ టౌన్ పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి అమీర్ హంజాను పాత బస్టాండు సమీపంలోని అన్న క్యాంటీన్‌లోకి పిలిపించి టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. అమీర్ హంజా కుటుంబ సభ్యులు ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న టీడీపీ నాయకులు అతన్ని అన్న క్యాంటీన్ వద్దకు పిలిపించి దాడికి పాల్పడ్డారు. అమీర్ హంజాను బెదిరింపులకు గురి చేసి ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, కారును తెప్పించుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, సీఎం సురేష్‌నాయుడు, మల్లేల లింగారెడ్డి, ఖలీల్, ఎర్రబల్లి దాదాపీర్, రెహమాన్, డాక్టర్ గౌస్, పవన్, ఆజాద్, లెజెండ్ (మార్కెట్), హరూన్, మన్సూర్‌లపై 147, 148, 324, 352, 386 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
టైర్ల వ్యాపారిని పరామర్శించిన ఎమ్మెల్యే రాచమల్లు
టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన అమీర్ హంజాను సోమవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న అమీర్ హంజాను పరామర్శించారు. దాడి ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడు రాచమల్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్‌మిల్లు ఖాజా, పార్టీ నాయకులు అమీర్ హంజాను పరామర్శించారు.
సీఎం సురేష్‌నాయుడు, మల్లేల లింగారెడ్డి సహా 12 మందిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment