పది ఫలితాల్లో ప్రతిభ | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో ప్రతిభ

Published Tue, Apr 23 2024 8:30 AM

పెంచలకార్తీక్‌ - Sakshi

పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభకనబరిచారు. ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందజేయడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశారు. దీంతోపాటు తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పట్టుదలతో చదివిన పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన మార్కులతో సత్తా చాటారు. ప్రతిభచూపిన విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

కడప ఎడ్యుకేషన్‌ : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు మార్కుల పరంగా భళా అనిపించారు. జిల్లాలో 200 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి జెడ్పీ హైస్కూల్‌కు చెందిన జత్వంత్‌కుమార్‌రెడ్డి 577 మార్కులు సాధించాడు. అదే పాఠశాలలో శ్రవంతి 570, హర్షీన్‌ 565 మార్కులు సాధించారు. ఎర్రగుంట్ల బాలికల పాఠశాలలో మేఘన 563, గులాబ్‌చాంద్‌ 556 , బాలుర పాఠశాలలో మంజుల యోగీశ్వర్‌ 561, అబ్థుల్‌ రఫీ 552 , ఎర్రగుంట్ల మండలం చిలమకూరు జెడ్పీ హైస్కూల్లో సునీతకుమారి 516 మార్కులను సాధించారు.

● మైదుకూరు బాలికల పాఠశాలలో శ్రావణి ధనలక్ష్మి 588, బాలుర పాఠశాలలో బ్రహ్మసాగర్‌ 560, యో గీంద్రకుమార్‌ 555, జీవీసత్రం జెడ్పీ హైస్కూల్లో శ్రీనివాసులు 530, లెక్కలవారిపల్లె జెడ్పీ హై స్కూల్లో వెంకట ఆశ్వని 530, వనిపెంట జెడ్పీ హైస్కూల్‌కు చెందిన సమీరా 587, శెట్టివారిపల్లె జెడ్పీ హైస్కూల్లో యశ్వంత్‌ 558, అనుషాదేవి 558, మైదుకూరు పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన దీక్షిత 578 మార్కులను సాధించారు.

● చాపాడు మండలానికి సంబంధించి అన్నవరం జెడ్పీ హైస్కూల్లో సిద్దిక్‌ 539, చాపాడు జెడ్పీ హైస్కూల్లో కావ్య 537, లక్ష్మిపేట జెడ్పీ హైస్కూల్లో వీరరాజేష్‌ 529 మార్కులను సాధించారు.

● పెండ్లిమర్రి మండలంలో గంగనపల్లె జెడ్పీ హైస్కూల్‌కు చెందిన చంద్రకళ 573 మార్కులు సాధించింది.

● పెద్దముడియం మండలం పెద్ద పసుపుల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన శ్రవంతి 576, ఉదయ శ్రీ 572, కేజీబీవీకి చెందిన అక్ష్య 569 మార్కులు సాధించారు.

● చక్రాయపేట మండలానికి సంబంధించి నాగులపల్లె జెడ్పీ హైస్కూల్‌కు చెందిన జస్వంత్‌ 585 , అంజలి 583, అబ్బాస్‌ 581 మార్కులను సాధించారు.

● కాశినాయన మండలంలో వెంకట ఇందు 571, శ్యామ్‌కుమార్‌ 566 మార్కులను సాధించారు.

● ముద్దనూరు మండలం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన తుమ్మలూరు అజంత 590 మార్కులను సాధించింది. స్థానిక జిల్లాపరిషత్‌ బాలికోన్నత పాఠశాలకు చెందిన శివమణి 578, నందిని 572 మార్కులు సాధించారు. ఈ పాఠశాలలో 20 మందికిపైగా విద్యార్థినులు 500 మార్కులు అధిగమించారని హెచ్‌ఎం శ్రీనివాసులు తెలిపారు. మండలంలో 94.34 శాతం ఉత్తీర్ణత పొందినట్లు ఎంఈఓలు సుబ్బారావు, నాగేశ్వరరావు నాయక్‌ తెలిపారు.

● చెన్నూరు మండలం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన తస్లీమ బాను 566, కొండపేట హైస్కూల్‌కు చెందిన ప్రత్యూస 544, రామనపల్లె జెడ్పీ హైస్కూల్‌కు చెందిన శివ మనోజ్ఞ 549 మార్కులను సాధించారు.

● బద్వేల్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన జస్వంత్‌ 586 మార్కులను సాధించారు.

● గోపవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి పెంచలకార్తీక్‌ 560 మార్కులు సాధించాడు. పెంచలకార్తీక్‌ను హెచ్‌ఎం నాగమణి, ఉపాధ్యాయులు అభినందించారు. కాగా పది ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రఘురాములు తెలిపారు.

● దువ్వూరు మండలంలోని మాచనపల్లె జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని గడ్డం సుమిత్ర 588 మార్కులు సాధించింది. మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో 265 మంది పరీక్షలు రాయగా 244 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా పుల్లారెడ్డి పేట జెడ్పీ హైస్కూల్‌, గుడిపాడు జెడ్పీ హైస్కూల్‌, పుల్లారెడ్డి పేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ రవిశంకర్‌ తెలిపారు.

● రాజుపాళెం మండలంలోని వెలవలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని అల్‌అర్ఫా 540 మార్కులు సాధించింది. మండల వ్యాప్తంగా 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రామస్వామి రెడ్డి తెలిపారు. బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో కె.సాయిప్రియ 537 మార్కులు, ఐ.శృతి 531 మార్కులు సాధించింది.

గడ్డం సుమిత్ర
1/3

గడ్డం సుమిత్ర

టి.అజంత
2/3

టి.అజంత

అల్‌ అర్ఫా
3/3

అల్‌ అర్ఫా

Advertisement
Advertisement