నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు

Published Sat, Sep 21 2024 2:40 AM | Last Updated on Sat, Sep 21 2024 2:40 AM

నిబంధ

వీరపునాయునిపల్లె : నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ అన్నారు. మండలంలోని పిల్లివారిపల్లె వద్ద ఇసుక డంపును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక కావాల్సిన వారంతా తమ పరిధిలోని సచివాలయంలో రికార్డులు, నగదు సమర్పించి రసీదు పొందాలన్నారు. రసీదు డంపింగ్‌ వద్దకు తీసుకెళ్తే ఇసుక నింపుతారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యకుమార్‌రెడ్డి, ఆర్‌ఐ భగీరథరెడ్డి, వీఆర్‌ఓ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం

వేంపల్లె : చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బీటెక్‌ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వేంపల్లిలో తలిశెట్టి సుబ్రహ్మణ్యం జడ్పీ బాలురోన్నత పాఠశాలలో 38వ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేంపల్లె ఆట స్థలంలో క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివ మునెమ్మ, నారాయణమ్మ, పీఈటీ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

నకిలీ బంగారం కేసులో ముగ్గురు అరెస్టు

ప్రొద్దుటూరు క్రైం : మైదుకూరు రోడ్డులోని స్టేట్‌ బ్యాంకులో నకిలీ బంగారంతో రుణం తీసుకున్న కేసులో పాతకోట వెంకటరమణ, బొంత శివకుమార్‌, షేక్‌ అబ్దుల్‌ఖాదర్లను టూటౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గతేడాది జరిగిన ఈ సంఘటనకు సంబంఽధించి ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులను తాజాగా అరెస్టు చేసినట్లు సీఐ యుగంధర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు 1
1/1

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement