వైద్యుల నిరసనలు ఉద్ధృతం | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిరసనలు ఉద్ధృతం

Published Sat, Sep 21 2024 2:40 AM | Last Updated on Sat, Sep 21 2024 2:40 AM

వైద్యుల నిరసనలు ఉద్ధృతం

కడప రూరల్‌ : జీఓ 85ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఏపీపీహెచ్‌సీడీఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు ఆందోళనబాట పట్టారు. శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా సమ్మెలోకి వెళ్లడంతో గ్రామీణ ప్రాంతాల పీహెచ్‌సీల్లో వైద్య సేవలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ సంఘం ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాఘవేంద్ర, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ వినయ్‌కుమార్‌, కోశాధికారి డాక్టర్‌ మహమూద్‌ తాహర్‌ మాట్లాడుతూ చర్చలు విఫలమైనా, ప్రభుత్వం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగిపినట్లు చెప్పుకోవడం తగదన్నారు. ఈ నెల 23న విజయవాడలో నిరసన తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నాగరాజుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలు పాల్గొన్నారు.

ప్రభుత్వంతో చర్చలు విఫలం

23న చలో విజయవాడకు పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement