ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష

Published Sat, Sep 21 2024 2:40 AM | Last Updated on Sat, Sep 21 2024 2:40 AM

ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష

కలసపాడు : కలసపాడు పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైన కేసులో ఆరుగురికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ బద్వేల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి వై.జె.పద్మశ్రీ శుక్రవారం తీర్పునిచ్చారు. ఎస్‌ఐ చిరంజీవి వివరాల మేరకు.. పంజగల వెంకటలక్ష్మమ్మ తన భర్త మరణించడంతో కుమార్తెతో కలిసి కలసపాడు మండలం దూలంవారిపల్లెలో జీవిస్తోంది. తన పెద్ద కుమార్తె భర్తతో అక్రమ సంబంధం ఉందంటూ సమీప బంధువులు దూషించి కొట్టి వేధించడంతో వెంకటలక్ష్మమ్మ మనస్తాపం చెందారు. 2014 అక్టోబరు, 16న విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె చిన్న కుమార్తె మల్లేశ్వరి కలసపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్‌ఐ ఆదివలి కేసు నమోదు చేశారు. వెంకటలక్ష్మమ్మను వేధించి ఆమె ఆత్మహత్యకు కారకులైనట్లు సాక్ష్యాధారాలతో నిరూపితం కావడంతో నిందితులు పంజగల వీరయ్య, పంజగల పెద్దవీరమ్మ, పంజగల వెంకటసుబ్బమ్మ, పంజగల పెద్ద వెంకటయ్య, పంజగల వెంకట రామయ్య, పంజగల వీరమ్మలకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నేరస్తులకు శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement