ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని తరలించరాదు
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషకు వినతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను సత్వరమే ఉపసంహరించుకోవాలని బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.హరిప్రసన్నకుమార్, కె.జగదీశ్వర్‌రెడ్డి కోరారు. సోమవారం సాయంత్రం వారు మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషాను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యాలయాలు అమరావతిలో కేంద్రీకరించాలని భావిస్తున్న నేపథ్యంలో నూతనంగా ఏర్పడబోతున్న గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కూడా అమరావతికి తరలిపోతుందన్న ఆందోళన నెలకొందన్నారు. అత్యంత కరువు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ, ఎక్కవ లాభాలు, అత్యధిక నిల్వలు, వ్యాపారంతో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించినటువంటి గ్రామీణ బ్యాంక్ తరలించడం తగదన్నారు. ఈ అంశం ప్రాంత అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చితే వెనుకబడిన రాయలసీమలో ఎటువంటి ముఖ్యమైన కార్యాలయాలు, సంస్థల కార్యాలయాలు లేకపోవడం బాధాకరమన్నారు. అంజద్‌బాషా మాట్లాడుతూ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగేలా తమవంతుగా కృషి చేస్తానని హామీమి ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హనుమంతరెడ్డి, మహమ్మద్, పీవీ రాహుల్‌తేజ్, కేఎన్ లోహిత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment