పందుల తరలింపులో ఉద్రిక్తత
జమ్మలమడుగు : పందుల తరలింపులో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మున్సిపల్ సిబ్బందిపై పందుల యజమానులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం ముద్దనూరు రోడ్డులో రిపబ్లిక్ క్లబ్బు సమీపంలో జరిగింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పందులను తరలించాలని మున్సిపల్ అధికారులు పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చారు. నెలరోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి నోటీసులు ఇవ్వడంతోపాటు వారం రోజుల క్రితం స్వయంగా వెళ్లి పందులను తరలించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా పందుల పెంపకందారులు స్పందించలేదు. దీంతో మున్సిపల్ అధికారులు పట్టణంలోని పందులను పట్టుకుని తరలించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పందుల యజమానులు, మహిళలు ఒక్కసారిగా ముద్దనూరు రహదారిలో ఉన్న మినీ లారీపై దాడి చేశారు. సీసాలలో పెట్రోల్ తీసుకుని వచ్చి వాహనంపై పోసి నిప్పు అంటించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు.
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు..
పందులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో పందుల యజమానులు ఒక్కసారిగా పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసి మినీలారీకి నిప్పుపెట్టడంతో డ్రైవర్ ప్రసాద్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. గాయపడిన డ్రైవర్‌ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు మినీలారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు, మున్సిపల్
అధికారులపై రాళ్లదాడి
Comments
Please login to add a commentAdd a comment