కడప సెవెన్‌రోడ్స్: గ్రామ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రుల ప్రభుత్వ, వైద్యులు, పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైందని.. వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవ లు అందించాలన్నారు. జిల్లాలోని మొత్తం 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు రాబోవు మూడు నెలలకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను తయారు చేసుకొని వచ్చే సమావేశంలో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. అనిమియా ఎక్కువగా ఉన్న వేంపల్లి, పోరుమామిళ్ల, చాపాడు వంటి రీజియన్ల పై ప్రత్యేక దష్టి సారించి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, డీఐఓ హిమదేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ బాలంజనేయులు,డిసీహెచ్‌ఎస్ ఇన్చార్జి కరిముల్ల, జీజీహెచ్ ఇన్చార్జి సూపర్డెంట్ నూకరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ఉమా మహేశ్వర రావు, మల్లేష్,ఖాజా మొయినుద్దీన్, శాంతి కళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment