● దీర్ఘకాల రాబడి
వ్యవసాయం భారంగా మారుతున్న వేళ ఆయిల్‌పాం సాగు సాయంగా నిలుస్తోంది. నిత్యం కష్టాలు..నష్టాలతో అలిసిపోయిన సీమ రైతుల కళ్లల్లో ఆశలు నింపడానికి బిరబిరా వస్తోంది. వర్షాల్లేక.. పంటలు రాక బీడుగా కనిపించే సీమ చేలల్లో ఆయిల్‌పామ్ నిండుగా కనిపిస్తోంది.
● ‘ఆయిల్ పామ్’ సాగుతో సిరులు!
● జిల్లాలో 500 ఎకరాల్లో సాగుకు శ్రీకారం
● ఇప్పటికే 150 ఎకరాల్లో సాగు.. 4 ఏళ్ల నుంచి దిగుబడి
● పంట సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
● హెక్టారుకు రూ. 71 వేల చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థికసాయం
నాలుగేళ్లపాటు పామ్ ఆయిల్ తోటలను జాగ్రత్తగా పెంచితే ఆ తరువాత 30 ఏళ్లపాటు రైతుకు నిరంతర లాభాలను తెచ్చిపెడుతుంది. నేల సారాన్ని బట్టి ఎకరాలకు 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎలాంటి చీడపీడల బెడద ఉండదు. నీటి వసతి అనుకూలంగా ఉన్న వారు బోరు బావుల కింద సాగు చేసుకోవచ్చు. సాధారణంగా ఒక ఎకరం వరిసాగుకు అవసరమయ్యే నీటితో 3,4 ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేసుకోవచ్చు. అలాగే మొదటి నాలుగేళ్లలో అంతర్ పంటల సాగుతో రైతులు ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు. కాగా ప్రస్తుతం టన్ను ధర సుమారు 17 వేలు ఉంది.
కడప అగ్రికల్చర్: పెరిగిన ధరలు, సాగు ఖర్చులతో నేడు వ్యవసాయం రైతన్నలకు భారంగా మారు తోంది. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తు న్నా ఏదో విధంగా నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఈ కష్టతర వ్యవసాయం నుంచి రైతన్నలను గట్టెక్కించేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడి వచ్చే పంటలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తోంది. పంటసాగుకు కావాల్సిన అన్ని రకాల సబ్సిడీలను అందచేస్తూ సాగుపై రైతన్నను సమాయత్తం చేస్తోంది.
జిల్లాలో సాగుకు శ్రీకారం...
ఆయిల్‌పాం సాగును జిల్లా రైతులు శ్రీకారం చుట్టారు. జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పలు ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో పంట సాగైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాలోని బిమఠం, మైదుకూరు, పొద్దుటూరు, కాశినాయన, పులివెందుల మండలాల పరిధిలో 500 ఎకరాల్లో పంట సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకుగాను జిల్లా ఉద్యానశాఖ అధికారలు ఆయిల్ పామ్ సాగుపై రైతన్నలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ రైతన్నలను ప్రోత్సహిస్తోంది. ఇందులో పంటసాగు.. వాటి నిర్వహణ, ప్రభుత్వ ప్రోత్సాహం, దిగుబడి .. రాబడి తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలోని ఎంపిక చేసిన మండలాల పరిధిలో 150 ఎకరాల్లో పంట సాగును చేపట్టారు.
● పంట సాగు నుంచి నాలుగేళ్ల తర్వాత దిగుబడి మొదలవుతుంది. 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఖర్చులు పోనూ ఎకరాకు సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం ఉంటుందని అధికారులు వివరించారు.
●సాగు విస్తరణ పెంచేందుకు...
●సాగుకు నాలుగేళ్లపాటు ఆర్థికసాయం
Comments
Please login to add a commentAdd a comment