గోపవరం : మండలంలోని పి.పి.కుంట చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సోమశిల నుంచి బద్వేలుకు వస్తున్న దాదాపు 20 ట్రాక్లర్లను పోలీసులు పట్టుకున్నారు. కాగా చెక్‌పోస్టు వద్ద నిలిపివేసిన ట్రాక్టర్లకు ఇసుకను తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. దీంతో పోలీసులు చెక్‌పోస్టు వద్ద ట్రాక్టర్లను నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహావసరాలకు మాత్రమే ఇసుకను తీసుకెళ్ళాలని, దీని కోసం తహసీల్దారు అనుమతి తప్పనిసరి అని పోలీసులు ట్రాక్టర్ల యజమానులకు సూచించారు. సోమశిల నుంచి టిప్పర్లు, ట్రాక్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిత్యం వందల సంఖ్యలో బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరు ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా వాహనదారులు ఇసుకను తరలిస్తే సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కాగా పట్టుబడిన 20 ట్రాక్టర్ల యజమానుల వివరాలు సేకరించి పోలీసులు వదిలేశారు. ట్రాక్టర్లను పట్టుకోవడం, ఆ తర్వాత వదిలేయడం పట్ల పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment