●తెరవెనుక మంత్రాంగంలో సీఎం రమేష్‌నాయుడు
క్షేత్రస్థాయిలో రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పనులు అడ్డుకొని స్థానికంగా ఉన్న సైట్ ఇంజినీర్లపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేస్తే ఎంపీ రమేష్‌నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు బాహాటంగా నోరు మెదపలేదు. తెరవెనుక మంత్రాంగంలో రమేష్‌నాయుడు ఉండిపోయారని సమాచారం. ఆమేరకు తన సోదరుడు రాజేష్‌నాయుడు సీఎం చంద్రబాబు వద్దకు పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రిత్విక్ సంస్థపై దాడి చేయలేదని, ఆదానీ కంపెనీపై దాడి చేశారంటూ కలరింగ్ ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. సీఎం స్థాయిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దాడి చేపట్టిన వ్యవహారంపై వాకబు చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. ఆదే వాస్తవమైతే ఫలానా వైఎస్సార్‌సీపీ నాయకులు పనులు చేస్తున్నారని, వారు అక్కడే ఉండి రెచ్చగొట్టారని ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదని విశ్లేషకులు నిలదీస్తున్నారు. రూ.1800కోట్ల సివిల్ పనులు రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారన్నదే ఎమ్మెల్యే వర్గీయుల అసలు ప్రశ్న. ఆ పనులు తామే చేయాలన్నదే వారి ఆకాంక్ష. ఆ విషయాన్ని తెరమరుగు చేసి, వైఎస్సార్‌సీపీ నేతల పనులంటూ దాడి వ్యవహారాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రక్తి కట్టించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment