‘ఉద్యాన రైతులను ప్రోత్సహించాలి’
కలసపాడు: ఉద్యాన పంటలు వేసుకున్న రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని తెల్లపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా దూలంవారిపల్లెలో కొమ్ములహరి ఉపాధి హామీ కింద సాగు చేసిన చీనీ పంట, మొక్కజొన్న పంటను పరిశీలించారు. చీనీ పంటలో ఎంత దిగుబడి వస్తోందని, పంటను ఎక్కడికి ఎగుమతి చేస్తారని, గిట్టుబాటు ధర ఉందా అని అడిగి రైతులను తెలుసుకున్నారు. అనంతరం దూలంవారిపల్లె చెరువును, తెలుగుగంగ ఎడమ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ స్వయం సహాయక సంఘాల గ్రూపులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెపూ ప్రకారం విద్యార్థులకు పెడుతున్నారా లేదా అని ప్రధానోపాధ్యాయురాలు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు.జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ విజయకుమార్, ఆర్డీఓ చంద్రమోహన్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment