200 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో కాలువ గట్టున నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ విశ్వనాథరెడ్డి, ఎకై ్సజ్ సీఐ చెన్నారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బ్రాహ్మణపల్లె గ్రామ పరిసర ప్రాంతాల పరిధిలో నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటు సారాను సరఫరా చేస్తున్న మల్లికార్జునరావును అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
నల్లపురెడ్డిపల్లెలో విషాదఛాయలు
పులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామ విద్యార్థి మృతితో శుక్రవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గంగరాజు, సంపూర్ణల కుమారుడు హేమాద్రి తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అటవీ ప్రాంతంలోని వాగులో ఈతకు వెళ్లారు. నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో హేమాద్రి మునిగిపోయాడని తన స్నేహితులు 100 కాల్ చేసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హేమాద్రిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హేమాద్రి మృతి చెందినట్లు తెలిపారు. కానీ బంధువులు మాత్రం స్నేహితులు చంపేశారని ఆరోపిస్తున్నారు. హేమాద్రి మృతదేహాన్ని శుక్రవారం తిరుపతి నుంచి నల్లపురెడ్డిపల్లె గ్రామానికి తీసుకొచ్చారు. హేమాద్రి మృతదేహాన్ని చూపి గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు బోరున విలపించారు.
విద్యార్థి సంఘం నాయకుడి అరెస్టు
ముద్దనూరు : స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహ సంక్షేమాధికారి మనోహర్‌ను బెదిరించిన కేసులో రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకుడు జగన్‌ను అరెస్టు చేసినట్లు సీఐ దస్తగిరి తెలిపారు. సీఐ తెలిపిన సమాచారం మేరకు.. హాస్టల్ విద్యార్థులను మోసం చేస్తున్నావంటూ సంక్షేమాధికారిని బెదింరించి అతని వద్ద నుంచి జగన్ డబ్బులు వసూలు చేసినట్లు వార్డెన్ ఫిర్యాదు చేశారని తెలిపారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు విద్యార్థి నాయకుడు జగన్‌పై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించారని సీఐ తెలిపారు.
గ్యాంగ్ రేప్ కేసులో
నిందితుడు అరెస్ట్
– పోలీసుల అదుపులో మైనర్లు
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ జిల్లా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్ పరిధిలో సుగాలిబిడికి ప్రాంతంలో మైనర్‌బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైన ఘటనలో ఉదయ్‌కిరణ్ అనే యువకుడిని సీఐ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి వారి ఆదేశాలను అనుసరించనున్నారు.
వీఆర్‌ఏను దూషించిన
భూ ఆక్రమణ దారుడు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని ఇబ్రహీంపేటకు చెందిన సుధాకర్ అనే భూ ఆక్రమణ దారుడు తనను కులం పేరుతో దూషించాడని పెన్నపేరూరు వీఆర్‌ఏ శాంత శుక్రవారం ఒంటిమిట్ట తహసీల్దార్ రమణమ్మకు ఫిర్యాదు చేసింది. వీఆర్‌ఏ ఫిర్యాదును స్థానిక పోలీస్ స్టేషన్‌కు రెఫర్ చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment