జోరుగా ఇసుక అక్రమ రవాణా
పెండ్లిమర్రి : మండలంలోని బుడ్డాయపల్లె గ్రామ సమీపంలోని పాపాఘ్నినదిలో కూటమి నేతల ఆధ్వర్యంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇసుక తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు అందోళ చెందుతున్నారు. కూటమి నేతలు గ్రామాలల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఇసుక అవసరమని ప్రభుత్వ అనుమతి లేని ఇసుక రిచ్‌ల నుంచి అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేసి సోమ్ము చేసుకుటున్నారు. మరి కొందరు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేసి అధిక రేట్లుకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ల బెడద ఎక్కువ కావడంతో బుడ్దాయపల్లె, మాచునూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చెరుకొని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను అదువులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగె బుడ్డాయపల్లె గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక డంప్‌లను గ్రామస్థులు గుర్తించి రెవెన్యూ అధికారులకు చూపించారు. ఇసుక డంప్‌ను వీఆర్వో చంద్రమోళిరెడ్డి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment