నిరుద్యోగ యువతకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు శిక్షణ

Published Sat, Nov 23 2024 12:32 AM | Last Updated on Sat, Nov 23 2024 12:32 AM

-

కడప కోటిరెడ్డిసర్కిల్‌: కిడ్స్‌ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ట్యాలీ ప్రైమ్‌, జీఎస్టీ అడ్వాన్స్‌, ఎకై ్సల్‌ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఉన్నతి ఫౌండేషన్‌ అడ్మిషన్స్‌ కో ఆర్డినేటర్‌ హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీకాం, ఎంకాం ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ యువకులు 20–30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఇందుకు అర్హులన్నారు. విజయవాడలో 45 రోజులపాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు.ఇతర వివరాలకు 90004 87423 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.

24న భట్రాజుల వన భోజనం

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా భట్రాజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24న కార్తీక వన భోజనం కార్యక్రమం నిర్వహించనునట్లు సంఘం ప్రధాన కార్యదర్శి అవధానం రఘురామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. శివకేశవులకు భేదభావం లేకుండా ప్రత్యేక పూజలు నిర్వహించే అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వన భోజనం కార్యక్రమం ద్వారా అందరూ ఒక చోట చేరి పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని నిర్వ హించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని చలమారెడ్డిపల్లె శివాలయంలో నిర్వహించనున్నట్లు చెప్పార

నేడు మదనపల్లెలో ఉర్దూ కవి సమ్మేళనం

మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండులోని బడేమకాన్‌ దర్గా ఆవరణలో శనివారం రాత్రి అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ముషాయిరా కమిటీ కన్వీనర్‌ పఠాన్‌ మహమ్మద్‌ఖాన్‌, కార్యదర్శి ఖమర్‌ అమీని తెలిపారు. శుక్రవారం దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవి సమ్మేళనానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరుకానున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉర్దూ కవులు కార్యక్రమంలో పాల్గొని మహా ప్రవక్త హజరత్‌ మహమ్మద్‌ జీవితంపై నాత్‌ ఏ షరీఫ్‌ పఠిస్తారని తెలిపారు. కార్యక్రమానికి ఉర్దూ భాషాభిమానులు, సాహితీప్రియులు హాజరుకావాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement