No Headline
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు.వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా ఉంది. ‘నోటితో మాట్లాడడం, నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే’అన్నట్లుగా ఉండిపోయింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రమేష్‌నాయుడు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిల వ్యవహారంలో డొంకతిరుగుడు మాటలు తెరపైకి వచ్చాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకతీతంగా ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.
ఎమ్మెల్యే మాధవీరెడ్డి కడపలో మద్యం షాపుల నిర్వహణ తీరుపై అసెంబ్లీలో గళమెత్తారు. మార్పు పేరిట డీ–ఆడిక్షన్ సెంటర్ మేడపైన నిర్వహిస్తుంటే, ఆ బిల్డింగ్ కిందనే మద్యం షాపు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కింద తాగి చెడిపోయిన వారు పైనున్న సెంటర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటారన్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్న మంచిదే అయినా, ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను బహిరంగ పర్చి ఉంటే బాగుడేందని పలువురు చెప్పుకొస్తున్నారు. జిల్లా కేంద్రమైన కడపలో రెడ్డి వైన్స్ వర్సెస్ మౌర్య వైన్స్ మధ్య పెద్ద ఎత్తున ఆధిపత్య పోరాటం నడిచిన విషయం జగమెరిగిన సత్యం. అక్కడ మౌర్య వైన్స్ ఉంచరాదనే విషయంపై అధికారులపై రాజకీయ ఒత్తిడులు వచ్చినా అక్కడే కొనసాగిస్తున్నారంటే మరో అధికార పార్టీ నేత ప్రమేయం ఉండడమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారంలోనైనా, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అసెంబ్లీలో గళమెత్తినా ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులు,సూత్రధారులు కూటమి ప్ర భుత్వ నేతలేనన్నది సుస్పష్టం. ఆ విషయాన్ని బ హిర్గత పర్చకుండా జాగ్రత్తపడుతూ రాజకీయ నే తల చర్యలు ఉన్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
● రిత్విక్ సంస్థపై దాడి చేసినా నోరు మెదపని ఎంపీ రమేష్‌నాయుడు
● రెచ్చిపోయి ఊగిపోతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
● ఆపై వైఎస్సార్‌సీపీ నేతల పనులంటూ..డొంకతిరుగుడు మాటలు
● ఎమ్మెల్యే మాధవీరెడ్డి సైతం మద్యం షాపుపై అసెంబ్లీలో ప్రస్తావన
● అన్నింటా పాత్రధారులు...సూత్రధారులు కూటమి నేతలే
బిల్టప్ మద్యం షాపుపై గళమెత్తిన రెడ్డెమ్మ...
Comments
Please login to add a commentAdd a comment