రెండు బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో రెండు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో రెండు బార్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అదే విధంగా జిల్లాలో ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం దరఖాస్తుదారులు ఈనెల 31 లోపు ఆన్‌లైన్‌లో చేసుకోవాలన్నారు. ఈ ప్రీమియం స్టోర్ ఐదేళ్లు కాగా లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.కోటి, రెండో ఏడాది నుంచి 10 శాతం ఫీజు పెంచుతామని వివరించారు.
ఎంపీ పీఏ విచారణకు హాజరు
పులివెందుల రూరల్ : పులివెందులలోని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం పిలిపించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో.. రాఘవరెడ్డిని పిలిపించామని సీఐ నరసింహులు తెలిపారు. విచారణలో భాగంగా రాఘవరెడ్డిని పిలిపించామే తప్ప మరేమీ లేదని సీఐ తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
వెండి నాగ ప్రతిమ చోరీ
కొండాపురం : మండల పరిధి పెంజిఅనంతపురం గ్రామ సమీపంలోని నీలమల్లేశ్వర కోనలో సోమవారం కొందరు శివ భక్తులు మాల వేసుకున్నారు. అక్కడికి వచ్చిన వారిలో గుర్తు తెలియని వ్యక్తులు నాగపడిగ ప్రతిమను పట్టపగలే చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు కిలోల వెండితో చేసిన నాగపడిగ ప్రతిమ సుమారు రెండు లక్షల విలువ ఉంటుందని భక్తులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో
వివాహిత మృతి
బి.కొత్తకోట : మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ గుడ్లవారిపల్లెకు చెందిన విజయనిర్మల (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవారిపల్లెకు చెందిన జనార్దన్ భార్య విజయనిర్మల సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్నారు. రాత్రివేళ నిద్రలేచి చూడగా.. అపస్మారక స్థితిలో ఉండటం గమనించి కుటుంబీకులు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బి.కొత్తకోట సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు విజయనిర్మల అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో విజయనిర్మల తమ్ముడు హరీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యనా, ఆత్మహత్యనా తేల్చేందుకు వారు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment