జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం
కడప సెవెన్‌రోడ్స్: సమాజ ఆర్థికాభివృద్ధితోపాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహ కారం ఎంతైనా అవసరమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా లోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణాలు అందించడంలో సెప్టెంబర్ మాసాంతానికిగాను జిల్లా పురోగమనంలో కొనసాగు తున్నందుకు బ్యాంకర్లను అభినందించారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి జిల్లా ఆర్థిక అభివృద్ధిలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, మహిళా అభివద్ధి, సాధికారిత, పొదుపు సంఘాల బలోపేతంతోనే సాధ్యం అవుతుందని వివరించారు. ‘వైఎస్‌ఆర్ విజన్ యాక్షన్ ప్లాన్ 2024– 29‘ప్రకారం జిల్లాను ఆర్థికంగా అభివద్ధి పథంలో నడిపించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల అభివృద్ధికి అపారమైన వనరులు ఉన్న ఆకాంక్ష జిల్లాను గ్లోబల్ ఎకానమీలో కీలక స్థానంలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఎస్‌హెచ్‌జీ నుంచి కనీసం ఒక్క మహిళా కుటుంబం ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. అర్హులైన యువ పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా రుణ సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంతకుముందు జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశానికి సంబంధించిన అజెండా, వివరాలను, పలు శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్ కి వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను 2024 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.17,939 కోట్లకు గాను రూ.12,309 కోట్ల మేర రుణాలు మంజూరు చేసి 68.61 శాతం ఆర్థిక ప్రగతిని సాధించిందని వెల్లడించారు. ఈ సమావేశంలో నాబార్డు ఏజీఎం విజయ విహారి, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ నవీన్ కుమార్, కెనరా బ్యాంకు ఏజీఎం మురళీ మోహన్, ఎసీబీఐ ఎజిఎం వాణీ కిషోర్ కుమార్ రెడ్డి, యూబీఐ ఏజీఎం లక్ష్మీ తులసి, ఏపీజీబీ ఏజీఎం శ్రీనివాస ప్రసాద్, కేడీసీసీ సీఈఓ రాజమ్మ, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్ రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, జీఎం చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు
ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల సహకారం అవసరం
డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment