ఆవిరైన ఆశలు..
ఆఫీసుల చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చింది లేదు... ఎవరి సిఫార్సుల కోసం అర్రులు చాచింది లేదు. అర్హులందరికీ ‘ఇంటి పట్టా’ చేతికొచ్చి వాలిందా రోజు. అంతే.. సంతోషంతో ఇళ్ల నిర్మాణంలో మునిగిపోయారు పేదలు... ఇంకొన్ని రోజుల్లో పనులు పూర్తయి సొంతింటి కల సాకారమవుతుందన్న కలలుగన్నారు. ‘కోడ్’ కూయడంతో బిల్లులు ఆగిపోయాయి. పనులు నిలిచిపోయాయి. ఆపై వచ్చిన ‘కూటమి’ ప్రభుత్వం ఎప్పట్లానే పేదలపై కక్షగట్టింది. సంక్షేమాన్ని అటకెక్కించింది. అభివృద్ధి మాటే మరిచింది. ముఖ్యంగా జగనన్న కాలనీల్లో అభివృద్ధి పరచాల్సిన ‘దారు’ల్లో ఆటంకాలు కలిగిస్తోంది. ఫలితంగా పేదల ఆశల చుట్టూ ఇలా ముళ్లపొదలు కమ్ముకుంటున్నాయి. కడప నగర శివార్లలోని వైఎస్సార్ కాలనీ సమీపంలోని జగనన్న కాలనీలో దృశ్యాలివి.
– ఫొటోలు.. సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప
Comments
Please login to add a commentAdd a comment