పరీక్షా ఫలితాలు విడుదల
వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) 3వ, 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీంబాషా మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ సెమిస్టర్‌లో 79.4 శాతం ఫలితాలు, 5వ సెమిస్టర్‌లో 91.4 శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల విభాగం అధికారులు రాఘవేంద్ర, డా. సుబ్రమణ్యం, హరిత, నాగమునిరెడ్డి, గురుమోహన్‌రెడ్డి, ఎం.వి.రమణ, శచీదేవి పాల్గొన్నారు.
వైవీయూలో అకడమిక్ ఆడిట్
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(ఐఎస్‌ఓ) ప్రతినిధుల బృందం సందర్శించింది. తొలుత ప్రతినిధుల బృందం హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సీఈఓ ఆలపాటి శివయ్య, ఆడిటర్ టి.సుమాదేవి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డిని కలిశారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, ఐక్యూఏసీ సంచాలకులు డా. ఎల్. సుబ్రహ్మణ్యం శర్మ, డిప్యూటీ డైరక్టర్ ఎం. సుభోష్ చంద్ర, గ్రీన్ అండ్ ఎనర్జీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని హ్యుమానిటీస్ బ్లాక్, సైన్స్ బ్లాక్, గురుకులం భవనాలలోని డిపార్ట్‌మెంట్‌లను పరిశీలించారు. శాఖలలో జరుగుతున్న ప్రగతిని ప్రత్యక్షంగా గమనించారు. బుధవారం కూడా పరిశీలన ఉంటుందని ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వీసీ కె. కృష్ణారెడ్డి మాటా ్లడుతూ హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రతిష్టాత్మక మైందని, అత్యున్నతస్థాయి విశ్వవిద్యాలయానికి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment