ఆకలి కేకలు
అరకొర జీతాలతోనే బతుకుబండి లాగించే చిరు జీవులపై అధికారులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. నెలనెలా జీతాలివ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కడప కార్పొరేషన్ లో అధికారుల నిర్లక్ష్యం కార్మికుల కుటుంబాలకు శాపంగా మారుతోంది. ఒళ్లొంచి పనులు చేస్తూ కూడా జీతాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. నెలల తరబడి వేతనా లు రాకపోవడంతో ఇదిగో ఇలా ఆఫీసుల ఎదు ట అర్థనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్న వీరికి ఒకటి రెండు కాదు మూన్నెళ్లుగా జీతాలు రాలేదు. ‘పండుగలు వస్తున్నాయి.. పస్తులుంచకుండా చూడండి సారూ’అంటూ కమిషనర్‌ను వేడుకుంటున్నారు. మరి కమిషనర్ వీరి సమస్యను తెలుసుకుని పరిష్కరించి కనికరిస్తారో... శీతకన్నేస్తారో చూడాలి. – కడప కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment